టాలీవుడ్ యంగ్ హీరో ఉదయ్‌కిరణ్ చాలాకాలం తర్వాత నటుడిగా తన పుట్టినరోజును శుక్రవారంనాడు జరుపుకున్నారు. ఉదయ్‌కిరణ్, శ్వేతబసుప్రసాద్ కాంబినేషన్‌లో ఓ కొత్త చిత్రం తెరపైకి రాబోతుంది.
ఈ సినిమా విశేషాలను ఉదయ్‌కిరణ్ పుట్టిన రోజు నాడే ప్రకటించడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్ డే ఫంక్షన్లో ఉదయ్ కిరణ్ కేక్ కట్ చేశారు. అనంతరం కేక్‌ముక్కను హీరోయిన్ శ్వేతబసు ఉదయ్‌కు తినిపించింది.
ఉదయ్ కొత్త చిత్రాన్ని చాణక్యమీడియా పతాకంపై డి. కుమార్, ఈశ్వర వరప్రసాద్‌లు నిర్మిస్తున్నారు. తమిళ దర్శకుడు సుభాసెల్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలో సెట్‌పైకి రానుందని మరిన్ని వివరాలు అతి త్వరలో తెలియజేస్తామని దర్శకుడు చెప్పారు.
ఉదయ్‌కిరణ్, కె. బాలచందర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పొయ్' (తెలుగులో అబద్ధం) చిత్రం చూశానని చెప్పారు. తమిళ సినిమా అయినా ఉదయ్ చక్కగా నటించి మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడని కితాబిచ్చారు. ఆగస్టులో ఈ చిత్రం ప్రారంభం కానుందని వెల్లడించారు.
ఉదయ్‌కిరణ్ మాట్లాడుతూ, పుట్టినరోజునాడే కొత్త సినిమా ఎనైన్స్‌మెంట్ చేయడం ఆనందంగా ఉందన్నారు. తనకు కొత్తగా అనిపించే సబ్జెక్ట్‌తో, 100శాతం వినోదంతో నూతన సినిమా రూపుదిద్దుకుంటోందని ఉదయ్‌కిరణ్ చెప్పాడు.
శ్వేతబసు హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి మాటలు: జనార్ధనమహర్షి. ఇతర సాంకేతిక సిబ్బంది వివరాలు త్వరలో తెలియజేస్తామని నిర్మాతలు తెలియజేశారు.