ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై శౌర్యం శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా "శంఖం". జె. భగవాన్, జె. పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ చిత్రం. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జూన్ 21 నుంచి శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది.
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన భగవాన్ మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి ఆస్ట్రేలియా సిడ్నీలో షూటింగ్ మొదలు పెట్టామన్నారు. గోపీచంద్, త్రిష, చంద్రమోహన్, శ్రీనివాసరెడ్డి, ధర్మవరపు, స్వాతి, రజిత, తెలంగాణా శకుంతలపై కీలకమైన దృశ్యాలను చిత్రీకరిస్తున్నామని తెలిపారు.
మరో నిర్మాత పుల్లారావు మాట్లాడుతూ, సిడ్నీలో తాము చేస్తున్నషూటింగ్ జూలై 10 వరకు కొనసాగుతుందని చెప్పారు. కథకు కీలకమైన దృశ్యాలతోపాటు గోపీచంద్, త్రిషలపైన రెండు పాటల్ని చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. జూన్ 29 నుంచి రెండు పాటల్లో ఓ పాటను సిడ్నీలోనూ, మరో పాటను ఆ సమీప ప్రాంతాల్లో శోభి మాస్టర్ నేతృత్వంలో చేస్తున్నామని పుల్లారావు తెలిపారు.
ఇకపోతే.. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రను తమిళ నటుడు సత్యరాజ్ పోషిస్తున్నారు. చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్, బెనర్జీ, కాట్రాజు, ప్రసాద్‌బాబు, సీత, రాధాకుమారి తదితరులు నటిస్తున్నారు.
ఇంకా ఈ సినిమాకు మాటలు: అనిల్ రావిపూడి, సంగీతం: తమన్, కెమెరా: వెట్రి, ఆర్ట్: వివేక, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ.