లక్స్‌పాప.. ఆశాషైనీ నటించిన "ఆ ఇంట్లో.." హార్రర్ చిత్రంలోని ఓ పాటలో చిన్నా ఆమె పెదాలను గాఢంగా చుంబించే సన్నివేశం ఉంది. ఆ సన్నివేశాన్ని సినిమా ట్రైలర్స్‌లో ప్రదర్శించారు. దాన్ని చూసిన వెంటనే నటుడు ఏవీఎస్ స్పందిస్తూ... తనకు అన్నిటికంటే మనసు దోచింది మయూర( లక్స్‌పాప పేరు మార్చుకుంది లెండి) పెదాలను చిన్నా ముద్దుపెట్టుకున్న సన్నివేశమనీ చెప్పుకొచ్చాడు.
దర్శకులు, నిర్మాతలు ఎందుకో హీరోలకే హీరోయిన్ల పెదవులను చుంబించే అవకాశాన్ని ఇస్తారు. మాలాంటి కమేడియన్స్‌కు ఎందుకివ్వరో.. మేం వారికంటే బాగా చేస్తామని చమత్కరించారు. ఇదంతా ఆ ఇంట్లో ఆడియో కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో జరిగింది.
ఆ కార్యక్రమంలో పాల్గొన్న మయూర ముసిముసి నవ్వులు నవ్వుతూ... "మీరూ సినిమా తీయండి... అప్పుడు చుంబించే అంశాన్ని చూద్దాం.." అని సరదాగా మాట్లాడడం విశేషం. విన్నారుగా ఏవీఎస్‌గారూ... నిర్మాతైతే చుంబనలే చుంబనలన్నమాట.