1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Aa Intlo| Cinema| Thrilling| Chinna| Mayuri| AVS | సినిమా తీయాలంటే ఛానెల్‌ పెట్టాలి: చిన్నా

ఆ ఇంట్లో
WD
సినిమా తీయాలనఉత్సాహం గల నిర్మాతలకు తెలుగు ఇండస్ట్రీలో ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఆ మధ్య "రాజుమహరాజు" నిర్మాత కుమారస్వామికూడా తన ఆవేదన వెల్లడించారు. ప్రస్తుతం 'ఆ ఇంట్లో' సినిమా నిర్మాతల్లో ఒకరైన చిన్నా మరోరకంగా అంటున్నారు.

తన స్నేహితులతో కలిసి "ఆ ఇంట్లో" సినిమా తీశాం. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అయినా రెండు పాటలు పెట్టాం. దాన్ని విడుదల చేయడానికి ఏ ఒక్క ఆడియో కంపెనీ ముందుకు రాలేదు. ఆఖరికి ఎఫ్‌.ఎం. వారుకూడా పాటలు వేయలేదు. పబ్లిసిటీకి ఎవరూ సహకరించలేదు.

పెద్ద హీరోల చిత్రాలకైతే పైసా ఇవ్వకపోయినా విపరీతమైన పబ్లిసిటీ చేస్తారు. దీంతో తమ సినిమాలకు వారు సమయం కేటాయించడంలేదు. దీన్ని బట్టి అర్థమయిందేమంటే...? నిర్మాత అనేవాడు తప్పనిసరిగా ఓ ఛానల్‌కు అధినేత అయితే మంచిదనే అభిప్రాయాన్ని చిన్నా వ్యక్తం చేశారు.

"రిలీజ్‌ముందు సూపర్‌ మార్కెట్‌ వారితో సంప్రదించాను. సీడీలపై మార్కెట్‌ పేరువేసి పబ్లిసిటీ చేస్తాం. మా క్యాసెట్‌ను ఉచితంగా వారికి అందజేయండి." అని అడిగాం. వారంతా అలా చేస్తే మాకెంత ఇస్తారు అని అడిగారు. "అదే పెద్ద సినిమాలకైతే ఎదురు ఇస్తుంటారు. ఇదీ మాయాలోకం" అంటూ చిన్నా సెలవిచ్చారు.
About Writer
SELVI.M