1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Producer

Kalavaramaye Madilo| Producer| Director| Overconfidence| Satish| Mohan | నిర్మాతకు ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదులే..!

కలవరమాయే మదిలో
కాకిపిల్ల కాకికి ముద్దు. సినిమా తీసే నిర్మాతకు తన సినిమా అంటే ముద్దు. కానీ దాన్ని ఎక్కువగా ఊహించుకుని రివర్స్‌ అయితే మాత్రం కోపంతో చిందులేయడం వంటి సంఘటన చోటుచేసుకుంది. "కలవరమాయమదిలో".. సినిమా నిర్మాత మోహన్‌ వడ్లపట్ల. ఆయనకు తన సినిమాపై విపరీతమైన నమ్మకం అట.

దర్శకుడు సతీష్‌ కాసెట్టిని కూడా పక్కన బెట్టి ఆయనే మొత్తం సినిమాను చూసుకోవడం.. దర్శకుడికి చిన్నచూపు అవుతుంది. సినిమా ముందునుంచి ఆహా.. ఓహో.. అన్న నిర్మాత.. రిలీజ్‌కుముందు మాత్రం గొడవపడ్డాడు. తాననుకున్నట్లు రాలేదనేది ఆయన వాదన. దర్శకుడు మాత్రం తన ప్రమేయంలేకుండా అన్నీ ఆయనే నిర్వహించారని చెప్పేసి వెళ్లిపోయారట.

మొత్తానికి తొలికాపీ వచ్చాక నిర్మాత తన స్నేహితులకు, సెన్సార్‌ వారికి చూపించారే తప్ప దర్శకుడిని పిలవనేలేదట. ఇదేమని అడిగితే.. తానొక హీరోగా నిర్మాత ఫీలవుతారనీ, ఎవరినీ పట్టించుకోడనేది దర్శకుడు విమర్శించారు.

సోమవారం రాత్రి ఈ సినిమా ప్లాటినం డిస్క్‌వేడుక జరిగింది. ఆ కార్యక్రమానికి దర్శకుడిని పిలవకుండా నిర్మాత వచ్చారు. పబ్లిక్ అయితే బాగోదని దర్శకుడూ వచ్చారు. అయితే ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ముభావంగా ఉండి ఎవరికివారు వెళ్ళిపోయారు.

ఇక థియేటర్‌లో జనాలు 15 శాతం ఉండడంలో నిర్మాత మొహం మాడ్చుకున్నారు. మరి ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ పనికి రాదులే..!. అలా ఎక్కువయితే ఇలాగే ఉంటుందని దర్శకుడు చెమక్కు ఇచ్చారు.
About Writer
SELVI.M