MayaBazar| ScreenPlay| Vengamamba| Cinema| Meena| Viswanath | "మాయాబజార్" స్క్రీన్‌ప్లే ''వెంగమాంబ''లో కనిపించింది..!
|
ఎందరినో పరిశీలించాం. ఎవ్వరూ సహకరించలేదు. అసలు వెంగమాంబ ఎవరో తెలీని వారుకూడా ఇండస్ట్రీలో ఉన్నారు.
ఏదైతే అయింది. అవసరమైతే 4కోట్లు పోయాయని అనుకుంటానని నిర్మాత దొరస్వామిరాజు ధైర్యంచేసి సినిమా తీశారు- అని దర్శకుడు ఉదయభాస్కర్ తెలిపారు.
వెంగమాంబ సినిమా తయారుకావడానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలను మంగళవారం ఆ చిత్ర దర్శకుడు ఉదయ భాస్కర్ తెలియజేశారు. ముందు ఈ కథను సీరియల్‌గా తీశాం. ఎస్.వి.ఛానల్‌వారు 52 ఎపిసోడ్లవరకు కొనసాగించారు.
ఏమైందో? ఏమో? అర్థంతరంగా ఆపేశారు. వెంగమాంబ సీరియల్ చూసే అభిమానులు ఫోన్లుచేసి.. ఏమిటి మంచి సీరియల్ ఆగిపోయింది? అని అడిగారు. దానికి సరైన సమాధానం చెప్పలేకపోయామని దర్శకుడు వెల్లడించారు.
ఎస్.వి. ఛానల్‌లో నెలకొన్న అవినీతి ధోరణులు, పర్సెంటేజ్ సిస్టమ్‌వల్ల సీరియల్ ఆగిపోయిందనుకుంటున్నారని. చాలామంది అడిగితే.. వారికి ఏమి చెప్పాలో అర్థంకాలేదు. ఏది ఏమైనా ఆ సీరియల్ ఆగిపోయిన తర్వాత... నిర్మాత దొరస్వామిరాజు తన కూతురు పోయినంతగా ఏడ్చారు. నిబద్ధతతో పనిచేస్తున్న నిర్మాతకు సరైన ప్రోత్సాహంలేదని తనకు కళ్ళు చెమ్మగిల్లాయని వెంగమాంబ దర్శకుడు తెలియజేశారు.
ఇవన్నీ వెంకటేశ్వరస్వామికి చెప్పలేంగదా.. ఆయనే మాకుదోవ చూపించారు. ఆ ధైర్యంతో వెంగమాంబ సీరియల్‌ను సినిమాగా మార్చాం. దానికి ఏ అడ్డంకులూ ఎదురుకాలేదని ఉదయ్ భాస్కర్ మనసులోని మాటను తెలియజేశారు. ఈ సినిమాను చూసిన విశ్వనాథ్.. మాయాబజార్ తర్వాత అంతటి స్క్రీన్‌ప్లే "వెంగమాంబ"లో కన్పించిందని ప్రశంసించడం పడిన కష్టానికి ఫలితం దక్కిందనుకుంటున్నామన్నారు.