1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. French

Asin | French | English | Hindi | Sanskrit | అసిన్‌కు ఎన్ని భాషలు వచ్చో తెలుసా...!

అసిన్
ప్రముఖ నటి అసిన్‌కు ఏడు భాషలు వచ్చంట. మూడు దక్షిణ భారత భాషలతోపాటు ఫ్రెంచ్, ఆంగ్లం, హిందీ మరియు సంస్కృతం భాషలను అనర్గళంగా మాట్లాడుతుందంట.

భాషలు నేర్చుకోవడం అంటే తనకు చిన్నప్పటినుంచే మహా ఇష్టం అట. తను చిన్నప్పుడు ఇతర విద్యార్థులకన్నా త్వరగా నేర్చేసుకునేదట. అందుకే ఆమె నటించిన అన్ని చిత్రాలకు తనే డబ్బింగ్ చెపుతోంది. దీంతో ఆమె నటించే చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదంటున్నారు నిర్మాతలు, దర్శకులు.

అసిన్‌కు ఆంగ్లానికి సంబంధించిన చాలా పదాలు గుర్తున్నాయట. దీంతో ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన స్క్రైబల్ ఇండోర్ ఆట అంటే చాలా ఇష్టమని, తను ఖాళీ సమయాల్లో ఈ ఆటను ఆడుకుంటుంటానని మరీ చిన్న పిల్లలా ఫోజొకటి పెట్టి మరీ చెప్పింది.
About Writer
Gulzar Ghouse