Nayantara| Kodi ramakrishna| Arundhati| Arjun| Uncle Anjaneyulu | నయనతారతో కోడి రామకృష్ణ కొత్తచిత్రం!
సెక్సీతార అనుష్కను "అరుంధతి" చూపించి హిట్ కొట్టిన ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ, మరో సెక్సీడాళ్ నయనతారతో కొత్త చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
'అమ్మోరు', 'దేవి', 'అరుంధతి' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ, నయనతార ప్రధాన పాత్రలో గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే కొత్త సినిమాను తెరకెక్కించనున్నారు.
ఎం.ఎస్.రాజు సంస్థపై కోడి దర్శకత్వంలో నయన ప్రధాన పాత్ర పోషిస్తున్న కొత్త చిత్రం రూపొందుతోంది. దీనితో పాటు అంతా కొత్త వారితో 'అంకుల్ ఆంజనేయస్వామి' అనే చిత్రాన్ని కూడా రామకృష్ణ ప్రారంభిస్తున్నారు.
