Magadheera| Banner| Ram Charan Teja| Allu Aravind | యువతరం కోసం "మగధీర" కొత్త నిర్మాణ సంస్థ!
WD
టాలెంట్ గల యువకులకు మంచి అవకాశం వస్తే తమ సత్తా ఏంటో నిరూపించుకోవడానికి చిరుతనయుడు, రామ్‌చరణ్ తేజ కొత్త నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి.
సరైన సమయంలో "మగధీర" తన నిర్మాణ సంస్థకు అంకురార్పణ చేయాలని రామ్‌చరణ్ ఆలోచిస్తున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా.. రామ్‌చరణ్ తేజ, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన "మగధీర" సినిమా ఈ నెల 31వ తేదీన తెరపైకి రానుంది.
ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యం వహించగా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వ పగ్గాలు చేపట్టారు.