Hindi Movie Lyricist| Gulshan Bawra| Passes away| Bollywood | బాలీవుడ్ పాటల రచయిత గుల్షన్ మృతి
ప్రముఖ బాలీవుడ్ పాటల రచయిత గుల్షన్ బావ్రా మరణించారు. సినీరంగంలో తన హవాను కొనసాగించి, తన పాటలతో శ్రోతలను ఇట్టే ఆకట్టుకున్న గుల్షన్‌కు మరణించేనాటికి 70 సంవత్సరాలు.
54 సంవత్సరాల పాటు సినీరంగంలో రాణించిన గుల్షన్ 240కి పైగా పాటలు రాశారు. "ఉపకార్" చిత్రంలోని "మేరే దేశ్ కీ ధర్తీ" అని సాగే దేశభక్తి గీతం సూపర్ హిట్టయ్యింది.
ఈ పాటతో పాటు "జంజీర్" చిత్రంలోని "యారీహై ఇమాన్ తేరీ" అనే పాట గుల్షన్‌కు ఎంతో గుర్తింపు సంపాదించిపెట్టింది. దీంతో పాటు ఈ రెండు పాటలకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి. పాకిస్థాన్‌లోని షేక్‌పురాలో జన్మించారు. దేశవిభజన సమయంలో గుల్షన్ తల్లిదండ్రులు దుండగుల చేతుల్లో హతమయ్యారు.