Jayee Bhava| Kalyan Ram| Hansika| Athanokkade| Hare Ram| Audio | కళ్యాణ్ రామ్, హన్సికల "జయీభవ" షూటింగ్ పూర్తి
అక్టోబర్ 1న నందమూరి హీరోలచే జయీభవ ఆడియో విడుదల
WD
ఈ సందర్భంగా హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 1న "జయీభవ" ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నామన్నారు. థామస్. ఎస్ ఈ చిత్రానికి సూపర్‌హిట్ సంగీతం అందించారు. పాటలన్నీ శ్రోతల్ని తప్పకుండా ఆకట్టుకుంటాయనే నమ్మకముందని చెప్పారు. అక్టోబర్ ప్రధమార్థంలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నామని కళ్యాణ్‌రామ్ తెలిపారు.
నందమూరి హీరోలు ముఖ్యఅతిథులుగా "జయీభవ" చిత్రం ఆడియోను రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్ హ్యాట్రిక్ ఫిలింగా రానున్న "జయీభవ"లో హన్సిక కథానాయిక పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం ద్వారానే నరేన్ కొండేపాటి దర్శకుడుదా పరిచయం అవుతున్నారు.
నందమూరి కళ్యాణ్‌రామ్, హన్సిక, ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, అలీ, రఘుబాబు, వేణుమాధవ్, చలపతిరావు, సుధ, హేమ, బెనర్జీ, వకీల్ ఖాన్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కథ, మాటలు: బి.వి.ఎస్. రవి, సంగీతం: థమన్ ఎస్, ఫోటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: రాజీవ్ నాయర్, సమర్పణ: మాస్టర్ నందమూరి శౌర్యారామ్, నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నరేన్ కొండేపాటి.