Srikant | 100 films | Book launch | Aravind | ఇప్పట్లో ఏ హీరో 100 చిత్రాలు చేయలేడు
శ్రీకాంత్ వంద చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నటించిన చిత్రాలను గురించి వివరిస్తూ ఇతరులు ఆయనపై ఉన్న అభిప్రాయాలను వెల్లడిస్తూ శ్రీకాంత్ 100 చిత్రాలు పుస్తకాన్ని విడుదల చేశారు. మంగళవారం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ పుస్తకాన్ని కె. రాఘవేంద్రరావు విడుదల చేయగా తొలి ప్రతిని అల్లు అరవింద్ అందుకున్నారు.
ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ... ఈనాడు హీరో వంద చిత్రాలు చేయడం గగనం. ఇప్పటి హీరోలు చేయలేకపోవచ్చు. శ్రీకాంత్ స్నేహపూరితమైన మనిషి. ఆయనలో ఎన్నో మంచి గుణాలున్నాయి. చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా చెపుతున్నానన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, వేషం కోసం వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో వంద చిత్రాలు పూర్తి చేసినప్పుడు కూడా ఆయన ప్రవర్తనలో మార్పులేదు. నేను ఆయనతో ఆరు సినిమాలు చేశాను. ఆయనను హీరోగా పరిచయం చేసింది నేనే. శ్రీకాంత్ ఇంకా మరిన్ని చిత్రాలను చేయాలని ఆశిస్తున్నాను అన్నారు.
ఇంకా ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.... ఇప్పట్లో ఏ హీరో కూడా 100 సినిమాలు చేయలేరని, ఏడాదికి ఒకటి రెండు చిత్రాలు చేయడంతోనే వారి పని అయిపోతోందని అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ... తనను పరిచయం చేసిన ఉషాకిరణ్ మూవీస్ నుంచి నేటి మహాత్మ నిర్మాత వరకూ అందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాన్నారు.