1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Spandana

MAA | Spandana | Star Night | Gachibowli | Hyd | Telugu Film | Balakrishna | వచ్చే నెల 7న వరద బాధితుల కోసం మా "స్పందన"

మా
వరద బాధితులకు సాయం చేసేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) తరపున వచ్చే నెల ఏడో తేదీన స్పందన అనే పేరుతో స్టార్‌నైట్ సంగీత విభావరిని నిర్వహించనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే ఈ సంగీత విభావరిలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ తారాగణమంతా పాల్గొంటుందని మా అధ్యక్షుడు కె.మురళీమోహన్ తెలిపారు.

ఈ అంశంపై మంగళవారం రాత్రి మా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మీడియా సమావేశం జరిగింది. ప్రముఖ టీవీ-మా కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సంగీత విభావరి ద్వారా వసూలయ్యే మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎం రోశయ్యకు అందజేస్తామని ఆయన తెలిపారు.

కాగా, ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను యువరత్న బాలకృష్ణ స్వీకరించారు. అలాగే, తెలుగులో హీరోయిన్లుగా నటిస్తున్న ఉత్తరాది భామలను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేయాల్సిన బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ చేపట్టారు.

ఇకపోతే.. ఈ సమావేశంలో ప్రసంగించిన నటుడు మోహన్ బాబు, డాక్టర్ రాజశేఖర్‌లు మాత్రం వివాదాస్పదంగా మాట్లాడటం గమనార్హం. ఈ సమావేశానికి గైర్హాజరైన మెగాస్టార్ చిరంజీవి అండ్ పార్టీని ఉద్దేశించేలా వీరిద్దరు ప్రసగించారు. ఇలాంటి సమావేశాలకు రాని వారిని పక్కన పెట్టాలని మోహన్ బాబు అన్నారు. అయితే రాజశేఖర్ మాత్రం దూరంగా ఉంచడం మంచిది కాదని, అందరూ కలిసి ముందుకు రావాలని అన్నారు.
About Writer
PNR