గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » దాసరి, వెంకీ చేతుల మీదుగా "చాప్టర్-6" ఆడియో (Chapter-6| Cinema| Audio| Dasari| Venkatesh| Rajasekhar| Jagapathi babu| Kalyani)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
సూర్యకిరణ్ దర్శకత్వంలో కళ్యాణి నిర్మాత రూపొందుతోన్న "చాప్టర్-6" ఆడియో ఆవిష్కరణ హైదరాబాదులో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన దర్శకరత్న డా. దాసరినారాయణరావు ఆడియోను ఆవిష్కరించి విక్టరీ వెంకటేష్‌కు అందజేశారు. ఆడియో సీడీని రాజశేఖర్ ఆవిష్కరించి జగపతిబాబుకు ఇచ్చారు.

ఆడియో విడుదల సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. కళ్యాణి మంచి నటి. ఆత్మీయుల సమక్షంలో ఆడియో వేడుక జరుపుకోవడం సమంజసంగా ఉంది. ప్రేమలోని ఆరు కోణాలను ఆవిష్కరించే కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని దాసరి ఆశించారు.

వెంకటేష్ మాట్లాడుతూ.. కథలో మంచి ఫ్రెష్‌నెస్ ఉంది. ఆడియోతో పాటు సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాన్నారు.

ఇకపోతే.. బాల, సోనియా, సూరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయి పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని వచ్చేనెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు సూర్యకిరణ్ తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: చాప్టర్6, సినిమా, ఆడియో, దాసరి, వెంకటేష్, రాజశేఖర్, జగపతిబాబు, కళ్యాణి