1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Katha| Cinema| Audio| Genelia| Prakash Raj| Arun Adit| NTR| Keeravani| Raja Simha | "కథ"ల కాన్సెప్ట్‌తో ఆడియో విడుదల!

కథ
WD
బొమ్మరిల్లు ఫేమ్ జెనీలియా హీరోయిన్‌గా రూపుదిద్దుకుంటోన్న "కథ" సినిమా ఆడియో వైవిధ్యంగా విడుదలైంది. జస్ట్ ఎల్లో అధినేత గుణ్ణం గంగరాజు ఈ కార్యక్రమాన్ని మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో వైవిధ్యంగా జరిపారు.

ముందుగా కొన్ని చీటీలు రాసి అందులో మూడక్షరాలు వచ్చే పదాలను రాసి దానికి తగినట్లుగా అతిథులు ఓ కథ చెప్పాలి. అలా కథను ఒక్కొక్కరు అల్లుకుంటూ కొనసాగించాలి. అవి ప్రేక్షకులను అలరించాలి.

మొదటి విడతలో.. రచయిత రాజసింహ, ఎన్టీఆర్, కీరవాణి, తమ్మారెడ్డి భరద్వాజ, రమా రాజమౌళి, రఘుబాబు, రాజమౌళి, ప్రకాష్‌రాజ్, జెనీలియా, చిత్ర హీరో అరుణ్ అదిత్ తదితరులు హాజరయ్యారు.

ఇందులో "కరెంట్ పావలా, పెన్‌డ్రైవ్, చీమలు దూరని చిట్టడివి"పై రాజసింహ కథ అల్లిన విధానం..
రాజసింహ కథ చెప్తూ.. "నేను విజయవాడకు బస్సులో బయలుదేరాను. దారిలో నా ల్యాప్‌టాప్ తీసి దానిలో పెన్‌డ్రైవ్ పెట్టాను. అది పనిచేయలేదు. కండక్టర్‌ను పెన్‌డ్రైవ్ ఉందా? అని అడిగితే.. నా దగ్గర పావలా చిల్లర అడిగితే ఇస్తాను అన్నాడు. బస్ ఓ చోట ఆగింది. చూస్తే అది చీమలు దూరని చిట్టడవి.

ఈ కథను కీరవాణి అందుకుని.. చీమలు దూరని చిట్టడవిలో పాస్ పోసుకుందామని వెళుతూ.. నా ల్యాప్‌టాప్ చాలా ఖరీదైంది కాబట్టి చంకలో పెట్టుకుని పాసుపోసుకుంటుంటే చీమ కుట్టింది. దాన్ని విదిలించేసరికి కాలి బొటనవేలిపై ల్యాప్‌టాప్ పడింది. దాన్ని కట్టు కట్టించుకుని ఈ ఆడియో ఫంక్షన్‌కు వచ్చానంటూ.. కథను జోడించారు. ఇలా తలా ఒక "కథ" చెప్పడంతో కథ ఆడియో విడుదల కార్యక్రమం ప్రేక్షకుల కరతాళధ్వనులతో మారుమ్రోగింది.
About Writer
SELVI.M