Prakash| Bhumika| Mr And Mrs Venkatesam| Collector| Lady Oriented Movie | "మిస్టర్ అండ్ మిసెస్ వెంకటేశం"గా ప్రకాష్, భూమికల చిత్రం!?
WD
కొంతకాలం దాసరి నారాయణరావు దగ్గర పనిచేసి, విదేశాలకు వెళ్లొచ్చిన తర్వాత ఈ కుటుంబకథా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ప్రకాష్‌రాజ్ కలెక్టర్‌గా భూమిక ఎం.బి.ఎ. చదివిన గృహిణిగా ఇందులో నటిస్తోంది. భార్యాభర్తలైన వీరిద్దరి మధ్య పొసగని కీచులాటలు వారి జీవితంలో ఎటువంటి మార్పులు తెచ్చాయనేదే చిత్ర కథని దర్శకుడు చెప్పారు.
లేడీ ఓరియెంటేడ్ మూవీగా రూపొందుతోన్న ఇందులో భూమిక ఆస్పత్రిలో చేరే సన్నివేశాల్ని బుధవారంనాడు హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడా సినీవిలేజ్‌లో చిత్రీకరిస్తున్నారు. దీంతో రెండో షెడ్యూల్ పూర్తవుతుంది. నవంబర్‌లో మిగిలిన టాకీ, డిసెంబర్‌లో పాటల చిత్రీకరణతో చిత్రం పూర్తవుతుందని, జనవరిలో సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు.
పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కామెడీ పార్ట్ హైలైట్‌గా ఉంటుందన్నారు. భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనేది ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
భూమిక మాట్లాడుతూ.. మంచి కథాంశంతో కూడిన చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని పేర్కొంది. సీనియర్ నటుడు ప్రకాష్‌రాజ్‌తో కలిసి చేయడం చాలా హ్యాపీగా ఉందని చెప్పింది.
ఇంకా ఈ చిత్రంలో శివపార్వతి, ఢిల్లీ రాజేశ్వరి, వైజాగ్ ప్రసాద్, వేణుమాధవ్, బాబూమోహన్, ధర్మవరపు, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: కాండ్రు పూర్ణ, సంగీతం: చిన్నా.