స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తోన్న "వరుడు" షెడ్యూల్ కేరళలోని అలెప్పీలో జరుగుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత డి.వి.వి. దానయ్య మాట్లాడుతూ.. అక్టోబర్ 28 నుంచి నవంబర్ పది వరకు అలెప్పీలో జరిగే షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని తీస్తున్నామన్నారు. అలాగే ఓ పాటను కూడా చిత్రీకరిస్తామని తెలిపారు.
అద్భుతమైన సబ్జెక్ట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఎంతో లావిష్‌గా ఈ చిత్రాన్ని మా దర్శకులు గుణశేఖర్ సూపర్ డూపర్ హిట్ అయ్యేలా రూపొందిస్తున్నారని దానయ్య చెప్పారు. తప్పకుండా ఈ చిత్రం మా బ్యానర్‌కి ప్రెస్టీజియస్ ఫిలిమ్ అవుతుందని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు.
ఇకపోతే.. "వరుడు" అల్లు అర్జున్ నటిస్తోన్న ఈ చిత్రం ద్వారా కొత్త హీరోయిన్‌ను పరిచయం అవుతోంది. తమిళ హీరో ఆర్య ఇందులో విలన్‌గా నటిస్తున్నారు.