గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » డిసెంబరులో "సలీమ్"గా వస్తున్న విష్ణువర్ధన్ (Saleem | Vishnuvardhan | Mohan Babul | Hyd | Logo | Iliyana | Kaveji Jha)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
WD
విలక్షణ నటుడు మోహన్‌బాబు తనయుడు విష్ణువర్థన్ బాబు, ఇలియానా జంటగా నటిస్తున్న చిత్రం "సలీమ్" ('దుమ్ముదులుపుతాడు అనే ట్యాగ్). ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో గురువారం జరిగింది. డిసెంబరు మూడో వారంలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్న ఈ చిత్రం ప్రోగ్రెస్‌పై చిత్ర నిర్మాత, నటుడు మోహన్‌బాబు మాట్లాడుతూ.. ఏడాది కాలంగా ఈ చిత్రం షూటింగ్ జరిగిందన్నారు.

కారణాలు ఏవైనా చిత్రం బాగా వచ్చింది. రిలయన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. నేను ఇందులో స్పెషల్ అప్పీరియన్స్‌గా ఉన్నాను. ఆ వివరాలను ఈనెల 11వ తేదీన వెల్లడిస్తానని చెప్పారు. అనేకంగా ఈ చిత్రం డిసెంబరు మూడో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.

ఆ తర్వాత చిత్ర దర్శకుడు వైవీఎస్.చౌదరి మాట్లాడుతూ.. లక్ష్మీ ప్రసన్న బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాభైవ చిత్రం. అనివార్య కారణాల వల్ల చిత్రం షూటింగ్ ఆరంభమైంది. ఇది చారిత్రాత్మకమైన కథ కాదు. వాస్తవ కథ అంతకంటే కాదన్నారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా తీసిన ప్రేమకథ. ప్రతి సన్నివేశం చాలా బాగా వచ్చిందన్నారు. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడని చెప్పారు.

కాగా, ఈ చిత్రంలో ఇలియానా, కావేరిఝా, ఆలీ, భరణి, జయప్రకాష్ రెడ్డి, జీవా, బెనర్జీ, తెలంగాణా శకుంతల, హేమ తదితరులు నటించారు. సంగీతం.. సందీప్ చౌతలా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. అశోక్ కుమార్ రాజు, ఆర్ట్.. ఆనందసాయి, స్టోరీ విభాగం.. గోపీ మోహన్, బీవీఎస్.రవి, పాటలు.. చంద్రబోస్, కెమెరా.. సి.రామ్ ప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. వైవీఎస్.చౌదరి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సలీమ్, విష్ణువర్ధన్, మోహన్బాబు, హైదరాబాద్, లోగో ఆవిష్కరణ, ఇలియానా, కావేరీ ఝా