1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. November 14

Children Film Festival| November 14| Hyderabad| Geeta Reddy| Switzerland| China| Srilanka| Germany| Iran| Iraq| China | నవంబర్ 14 నుంచి అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం
WD
రెండేళ్లకొకసారి నిర్వహించే బాలల చిత్రోత్సవాలు నవంబర్ 14 నుంచి 20వరకు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, పిల్లల్లో సృజనాత్మకశక్తిని పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి అన్నారు.

16వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవ వివరాలను గీతారెడ్డి తెలియజేస్తూ..బాలల్లో చక్కని సంస్కృతిని, విజ్ఞానాన్ని పెంపొందించడం సామాజిక లక్ష్యాలలో ప్రధానమైందన్నారు. ప్రభుత్వపరంగా అన్ని శాఖలూ ఈ ఉత్సవాలకు సహకారాలందిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చి డెలిగేట్లకు సౌకర్యాలు ఏర్పాటుచేస్తున్నామని గీతారెడ్డి చెప్పారు.

చిత్రోత్సవాల ఛైర్‌పర్సన్ నందితాదాస్ మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్, జర్మనీ, చైనా, శ్రీలంక తదితర దేశాలకు చెందిన 160 ఎంట్రీలు వచ్చాయన్నారు. అందులో ఉత్తమమైనవిగా 60 ఎంపికచేశామని చెప్పారు. సి.ఎఫ్.ఎస్.ఐ వీటిని స్క్రీనింగ్ చేసిందని చెప్పారు.

ఇంటర్నేషనల్ సెక్షన్, ఏషియన్ పనోరమ అనే రెండు రకాలుగా అవార్డులను నవంబర్ 20న ప్రదానం చేయనున్నట్లు నందితాదాస్ తెలిపారు. అన్ని చిత్రాలను పరిశీలిస్తే మనదేశంలో బాలల చిత్రాల నిర్మాణం తగ్గిపోయిందని ఆమె చెప్పారు. ఇరాన్. ఇరాక్ దేశాల్లో మంచి చిత్రాలు వస్తున్నాయని, పిల్లలతో పాటు పెద్దలు చూసేట్లుగా ఈ చిత్రాలుంటాయని పేర్కొన్నారు.

దాదాపు 250మంది డెలిగేట్స్ ఈ చిత్రోత్సవాలకు హాజరవుతున్నారని, వీరేగాకుండా రాష్ట్రంలోని ప్రతి జిల్లానుంచి 5గురు చొప్పున డెలిగేట్స్‌గా వస్తున్నారని చలన చిత్ర టీవీ రంగస్థం అభివృద్ధి సంస్థ డైరక్టర్ పార్థసారథి చెప్పారు. ఆ వివరాలను త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

బాలల చిత్రాలకు శాశ్వత వేదికగామారిన హైదరాబాదులో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సి.ఎఫ్.ఎస్.ఐ.సిఇఓ సుశోవన్ బెనర్జీ అన్నారు.
About Writer
SELVI.M