శివాజీ, శృతి హీరోహీరోయిన్లుగా అరుణ్ సింగార్ దర్శకత్వంలో శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై హీరో శివాజీ నిర్మిస్తున్న తాజ్ మహల్ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, ఈ చిత్రం క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది.
ప్రతి ఒక్కరి జీవితాల్లో పెనవేసుకుపోయిన ప్రేమ, దాని తాలూకు అనుభూతుల నేపథ్యంలో ఈ చిత్ర కథాంశం సాగుతుంది. అభిమాన్ రామ్ అందించిన మెలోడియస్ సంగీతం అందరినీ ఆకట్టుకుంటుంది. పాటలన్నీ శ్రోతలను అలరిస్తున్నాయి. డిసెంబరు ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేయనున్నాము" అన్నారు.