1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cine Career

Mohan Babu | Cine Career | Swargam Narakam | Tollywood | రెండంటే రెండు పెగ్గులే తాగుతా: మోహన్ బాబు

మోహన్ బాబు
WD
ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం అంటూ సినీ ఇండస్ట్రీలో ఎవరున్నారంటే... మంచు మోహన్ బాబు గుర్తుకు వస్తారు. తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న విలక్షణ నటుడు మోహన్ బాబు. తన గురువుగారంటూ.. చెప్పుకునే దాసరి నారాయణరావు ఆయనను సినీరంగానికి పరిచయం చేశారు.

అసిస్టెంట్ దర్శకుడిగా, కో డైరెక్టర్‌గా పలు చిత్రాలకు పనిచేసిన ఆయన దాసరి వద్ద దర్శకశాఖకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. దాసరి కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ స్వర్గం- నరకంలో మోహన్ బాబుకు నటుడిగా ఛాన్స్ ఇచ్చాడు. సరిగ్గా ఆ చిత్రం విడుదలై రేపటికి (22.11.2009) 35 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా ఆయన తన సన్నిహితులైన మీడియా అధినేతలతో ముచ్చటించారు.

సినిమారంగంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానన్నారు. ఆత్మీయుడు రజనీకాంత్ గురించి ప్రస్తావిస్తూ... అటువంటి మానవతావాదిని మరే ఆర్టిస్టులోనూ చూడలేదన్నారు. అప్పట్లో సినిమా రంగంలో హీరోగా ఎదగాలంటే... చాలా కష్టపడాల్సి వచ్చిందంటూ.. ఇప్పుడు అంతా బ్రాండ్‌లా మారిపోయి.. కొడుకులు వస్తున్నారంటూ... తన కుమారులు గురించి కూడా ప్రస్తావించారు.

ప్రేక్షక దేవుళ్ల ఆశీస్సులుంటే వారు ఈ రంగంలో ఎదుగుతారు. లేదంటే... వేరే రంగంలో ఉంటారని తేల్చి చెప్పారు. మీ పిల్లలుకంటే మీరే ఇంకా గ్లామర్‌గా ఉన్నారనే ప్రశ్నకు బదులిస్తూ... అదంతా దైవ ప్రసాదం. అందుకే ఈ దేహాన్ని అదుపాజ్ఞలలో ఉంచుకుంటాను. పరిమిత ఆహారం, చేస్తే యోగా చేస్తాను. లేదంటే వ్యాయామం చేస్తాను. నేను గత జన్మలో కంచును మింగానేమో.. అందుకే కంచుకంఠం వచ్చిందంటూ నవ్వారు.

రోజూ రెండు పెగ్గులు మాత్రమే తాగుతాననీ అన్నారు. భవిష్యత్ ప్రణాళికలు ఏమీ లేవనీ, అన్నగారైన ఎన్టీఆర్ కోసమే రాజకీయాల్లోకి వెళ్లాననీ, ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నానీ, అవి తనకు సరిపడవనీ చెప్పారు. అబద్దాలు ఎక్కువగా ఆడాలి. లేనిదానిని ఉందని నమ్మించాలి. ఎంతకాలం నమ్మిస్తాం అన్నారు. మరి అన్నగారు కూడా అలా చేశారా...? అనే ప్రశ్నకు... ఆయన చెప్పింది చేసి చూపారు. రెండు రూపాయలకే కిలో బియ్యం...అన్నారు. ఇచ్చారు. పేదలకు న్యాయం చేశారు. ఏదిఏమైనా లేనివారి గురించి మాట్లాడటం భావ్యం కాదన్నారు.

35 ఏళ్ల కెరీర్‌ను విశ్లేషిస్తూ... కొన్ని తెలిసో తెలియకో... తప్పులు చేసి ఉండవచ్చు. కానీ దాని వల్ల కాస్త ఇబ్బందులు పడ్డా... ఎవరి పొట్టను కొట్టలేదు. తాను విద్యాదానం చేస్తున్నాననీ గర్వంగా చెబుతున్నానంటూ.. కర్నూలు పరిసర ప్రాంతాల్లో వరదబారిన పడి సర్టిఫికెట్లు కూడా కోల్పోయిన ఐదుగురు మెరిట్ విద్యార్థులకు తాను ఉచితంగా విద్య బోధిస్తున్నాననీ, శ్రీ రాఘవేంద్రస్వామి నాకు ఇచ్చిన స్తోమత మేరకు విద్యాదానం చేస్తానని అన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT