Nagarjuna , Tollywood, Mosagadu, | యువసామ్రాట్ నాగార్జున "రమ్మీ" కాదు "మోసగాడు"
నాగార్జున హీరోగా డి. శివప్రసాదరెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని చిత్రానికి తొలుత రమ్మీ అనుకున్నారు. ఇప్పుడు మోసగాడు పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
చిత్రం విశేషాలను డి. శివప్రసాదరెడ్డి తెలియజేస్తూ... కామాక్షి మూవీస్ బ్యానర్‌పై 1984 నుంచి చిత్రాలు నిర్మిస్తున్నాం. 1985లో తొలి చిత్రం శ్రావణ సంధ్య విడుదలైంది. 2010 సిల్వర్ జూబ్లీ ఇయర్.
ప్రస్తుతం నాగార్జునతో నిర్మిస్తున్న ఈ చిత్రం స్క్రీన్ ప్లే డిఫరెంట్‌గా ఉంటుంది. త్వరలోనే చిత్రం టైటిల్‌ను ప్రకటిస్తాం. అంతేగాక ఈ చిత్రం విడుదలయ్యే జనవరిలోగానే నాగచైతన్య హీరోగా ఓ భారీ చిత్రాన్ని ప్రారంభిస్తాం. మంచి సబ్జెక్టు రెడీ అయిందన్నారు.
