1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Sindhu Menon

Subhadra | Sindhu Menon | Ravi Kiran | త్వరలో ప్రేక్షకుల ముందుకు "సుభద్ర"

సుభద్ర
WD
సుప్రసిద్ధ నిర్మాత డా. డి. రామానాయుడు చేతుల మీదుగా శ్రీకాంత్ టాకీస్ వారి "సుభద్ర" లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. యువ నిర్మాత శ్రీకాంత్ గౌడ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజావన్నెంరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. "చందమామ" ఫేమ్ సింధుమీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాల్ని ముగించుకుని రీ-రికార్డింగ్ జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ... ఇటీవలే విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పారు. సంగీత దర్శకుడు చక్రి ఆధ్వర్యంలో "సుభద్ర" సినిమా రీ-రికార్డింగ్ జరుగుతుందన్నారు. సంగీత దర్శకుడు చక్రి మాట్లాడుతూ... దర్శకులు రాజావన్నెంరెడ్డి ఎంతో శ్రమించి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆయన తీర్చిదిద్దిన ఈ చిత్రానికి అందరూ మెచ్చే స్థాయిలో రీ-రికార్డింగ్ చేస్తున్నానని తెలిపారు. వైవిధ్యమైన కథలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేస్తారనే నమ్మకం ఉందని చక్రి అన్నారు.

రీ-రికార్డింగ్ తర్వాత మిక్సింగ్ కార్యక్రమాల్ని పూర్తి చేసి అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న "సుభద్ర" చిత్రాన్ని అద్భుతంగా మలచిన రాజావన్నెంరెడ్డిని ఈ సందర్భంగా అభినందిస్తున్నానని చక్రి వెల్లడించారు. సింధుమీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో రవికిరణ్ ముఖ్యపాత్రను పోషించగా ఆశిష్ విద్యార్థి, సుమన్, భానుచందర్, చలపతిరావు, చిన్నా, గౌతంరాజు, అన్నపూర్ణ, సురేఖావాణి, హేమ తదితరులు నటించారు.

ఇంకా ఈ చిత్రానికి ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కళ: నాగేంద్ర, ఛాయాగ్రహణం: సుధాకర్ రెడ్డి వద్ద పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT