Yuganiki Okkadu | Karti | Reemasen | రెండేళ్లపాటు "యుగానికి ఒక్కడు" కోసమే!!: రీమాసేన్
కార్తి కథానాయకుడిగా రీమాసేన్ కథానాయికగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్ వాలి కార్పొరేషన్ స్టూడియో గ్రీన్ నిర్మించిన తమిళ చిత్రాన్ని "యుగానికి ఒక్కడు"గా తెలుగులో అనువదించారు. ఈ చిత్రం ఈనెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
కార్తి మాట్లాడుతూ.. "ఇటీవలే ఈ చిత్రం తమిళలో విడుదలైంది. మంచి కలెక్షన్లతో ప్రదర్శించబడుతోంది. తెలుగు ప్రేక్షకులకోసం ఈ చిత్రాన్ని కొంత ట్రిమ్ చేశాము. వైవిధ్యమైన కథాంశంతో దాదాపు రెండున్నర ఏండ్లపాటు రూపొందించాం. ఎంతో కష్టపడ్డాము. ఇందులో డీగ్లామరైజ్డ్ పాత్ర పోషించాను. సూర్య కూడా చూసి మెచ్చుకున్నారు. తెలుగువారు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.
దర్శకుడు శ్రీరాఘవ మాట్లాడుతూ... "రెండున్నరేళ్లుగా పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కన్పించింది. చూసినవారంతా బాగుందని ప్రశంసిస్తున్నారు. సినిమాకోసం చోళుల కాలంనాటి విషయాలను రీసెర్చ్ చేశాము. అప్పటికి తగినట్లు సంగీతం కూడా చేయడం జరిగింది. ఈ సినిమాకు అంతా దక్షిణాదివారే పనిచేశారు. ప్రపంచ సినిమాకు ఈ సినిమా ఏమాత్రం తీసిపోద"న్నారు.
