1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Adurs

Magadheera | Adurs | Ram Charan Teja | Junior NTR | మా "మగధీర" - "అదుర్స్" దొంగలించారంటున్న రచయితలు

మగధీర
WD
సినిమాల కథల విషయంలో మరోసారి వివాదం నెలకొంది. గతంలో చాలా హిట్ చిత్రాలు తమ కథలే అంటూ విడుదల తర్వాత రచయితలు ముందుకు వచ్చారు. అప్పట్లో దాసరి నారాయణరావు కథలన్నీ కాపీయేననే పేరు వచ్చింది. మేఘసందేశం, ప్రేమాభిషేకం, నుంచి బొబ్బిలిపులి వరకూ ఆయనను ఆ వివాదాలు వెంటాడాయి. తాజాగా మరో రెండు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్న రచయిత చారి
తన రచనను అనుమతి లేకుండా మగధీర చిత్రంగా నిర్మించారని నవలా రచయిత ఎస్పీ చారి ఆరోపించారు. ఈ చిత్రం విడుదలకుముందే "చందేరి" అనే నవల ఆధారంగా తీశారనే విమర్శలు వచ్చినా దాన్ని తొక్కిపెట్టి ఉంచారు.
1998లో అది ఒక మాసపత్రికలో సీరియల్‌గా వచ్చిందనీ 2008లో దాన్ని నవలగా ముద్రించాననీ చారి హైదరాబాదులో చెప్పాడు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్‌ను సంప్రదిస్తే... రేపు, మాపు చూద్దామని వాయిదా వేస్తూ వచ్చాడనీ, ఆ తర్వాత ఎస్ఎంఎస్‌లు కూడా పంపాడనీ వాటిని చూపిస్తున్నాడు.

ఆ తర్వాత కొన్నాళ్లకు మగధీరను మర్చిపొమ్మని చెప్పి మరో రచనతో సినిమా తీసి ఆ సమయంలో మొత్తం నష్ట పరిహారాన్ని ఇస్తానని చెప్పినట్లు వివరించారు. మగధీరను హిందీలోనూ తీసే ఆలోచన ఉందని తనకు పరిహారం చెల్లించకుండా తీస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వార్నింగ్ ఇచ్చాడు.

జేఏసీవారిని కలిసిన అదుర్స్ రచయిత
అదుర్స్ కథను తానే రాశానని తనకు తగిన న్యాయం చేయాలని ఇటీవలే కరీంనగర్‌కు చెందిన రాంరెడ్డి మీడియా ముందుకు వచ్చాడు. సోమవారంనాడు అతను ఉస్మానియాలోని జేఏసి నేతలను కలిశాడు. 2008 జూన్ 15న తన కథను ఎన్టీఆర్‌కు పంపానని వివరించారు. కథ బాగుందని మెచ్చుకుని తన సహాయకుడు జీవన్‌కు స్క్రిప్ట్ ఇచ్చి వెళ్లాలని సూచించాడని పేర్కొన్నాడు. తనకు న్యాయం చేయాలని లేదంటే ఆయన నివాసం ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించాడు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT