1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Vishal

Kiladi | Vishal | February | ఫిబ్రవరి మూడో వారంలో వస్తోన్న "కిలాడి"

కిలాడి
పందెం కోడి, పొగరు, భరణి మొదలైన సూపర్ హిట్ చిత్రాల ద్వారా హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న యాక్షన్ హీరో విశాల్ ఇప్పుడు మరో భారీ చిత్రాన్ని చేశారు. జీకే ఫిలిమ్ కార్పొరేషన్ పతాకంపైన కిలాడి అనే క్రేజీ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. 

నిర్మాత విక్రమ్ కృష్ణ మాట్లాడుతూ... "మా కిలాడి చిత్రంలో విశాల్ ఇంతవరకూ నటించనటువంటి ప్లే బాయ్ పాత్రను అద్వితీయంగా పోషించారు. తను దేన్నైనా ఎన్నిక చేసుకునే ముందు మూడు విధాలుగా ఆలోచించుకోవడం అలవాటు. ఆ విధంగానే జీవిత భాగస్వామి విషయంలో కూడా ముగ్గురు అమ్మాయిల్ని అనుకుంటాడు. ఈ ముగ్గురిలో ఎవరిని కిలాడి సొంతం చేసుకుంటాడన్నదాన్ని వెండితెరమీద చూడాల్సిందే.

ఇక సినిమాపరంగా అన్ని కార్యక్రమాలు పూర్తయి ఫైనల్ స్టేజిలో ఉన్నది. ఫిబ్రవరి మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, లవ్ అంశాలన్నీ కలగలిసి తెరకెక్కిన ఈ చిత్రం అన్ని తరగతులవారిని మెప్పించే చిత్రమవుతుందన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT