1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Rajaneekanth

Larence | Rajaneekanth | Robo | రజనీకాంత్ కౌబాయ్ అయితే...?

లారెన్స్
WD
అవును. సూపర్ స్టార్ రజనీకాంత్ కౌబాయ్ అయితే ఫ్యాన్స్‌లో పెద్ద క్రేజ్ ఏర్పడుతుంది. కానీ రోబో సినిమా బిజీలో ఉండటంతో ఆ ఛాన్స్‌ను రజనీ కోల్పోయారనే చెప్పాలి. శింబు దేవన్ అనే దర్శకుడు కౌబాయ్ కథను తీసుకుని లారెన్స్ వద్దకు వచ్చాడు. ఆ కథను విన్నాక చాలా ఎంజాయ్ చేశాడు లారెన్స్.

కానీ నాకే ఎందుకు చెబుతున్నారని అడిగితే... శింబుదేవన్ కోడైరెక్టర్ అందుకు సమాధానమిచ్చాడు. ముందుగా రజనీసాబ్ కోసం రాసుకున్నారు. సిగరెట్ తాగడం, క్యాప్ పెట్టుకోవడం, తుపాకి పేల్చడం వంటివి రజనీ స్టైల్ వెరైటీగా ఉంటుంది. కానీ రజనీగారు రోబో షూటింగ్‌లో బిజీగా ఉండటం... అది సంవత్సరాలు పట్టడంతో లారెన్స్‌కు కూడా ఒక స్టైల్ ఉంది అని శింబుదేవన్‌కు లారెన్స్ చిత్రాలు చూపించాడట.

దాంతో దర్శకుడు లారెన్స్‌ను ఓకే చేశారు. ఆ సినిమానే "సూపర్ కౌబాయ్". తమిళంలో ఆడియో విడుదలైంది. సినిమాను ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు లారెన్స్ హైదరాబాదులో ప్రకటించారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT