Balakrishna | Simha | Nayanatara | Sneha Ullal | Namita | Audio Release | బాలయ్య, నయనల "సింహా" పాటల విడుదల
WD
షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేశామని నిర్మాత వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ నెలాఖరులో సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అభిమానిగా ఎలా ఉండాలో? ఆ విధంగా బాలయ్య సినిమా చేశాను. రెండు పాత్రల్లో నటనతో బాలకృష్ణ ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తాడు. ఇంకా అన్ని వర్గాల వారిని అలరించే చిత్రంగా "సింహా" ఉంటుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు.