1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Gowtham

Vareva Movie | Gowtham | Brahmanandam | Son | Shambhavi | Dasari | బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా "వారెవా" ప్రారంభం

గౌతమ్
WD
ప్రముఖ హాస్యనటులు పద్మశ్రీ డా. బ్రహ్మానందం అబ్బాయి గౌతమ్ హీరోగా, నూతననటి శాంభవి హీరోయిన్‌గా మహేశ్వరరావు నిర్మాతగా మూవి మిరాకిల్స్ సంస్థ నిర్మిస్తున్న "వారెవా.." చిత్రం ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది.

దేవుని పటాలపై తీసిన తొలి షాట్‌కు దర్శకరత్న డా. దాసరి నారాయణ రావు క్లాప్ కొట్టగా, శ్రీమతి తులసి కెమేరా స్విచ్ఛాన్ చేశారు. బ్రహ్మానందం పూజా కార్యక్రమాలు నిర్వహించగా బేబి గీతాంజలి స్క్రిప్ట్‌ని దర్శకునికి అందించారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. మే 3వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమౌతుందన్నారు. మే, జూన్, జూలైలలో హైదరాబాద్, వైజాగ్, గోవాలలో టాకీ పార్ట్, ఆగస్టులో పాటల చిత్రీకరణతో సినిమా పూర్తవుతుందని, అక్టోబర్ 8న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలియజేశారు.

ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, దేవన్, షాయాజీ షిండే, డా. బ్రహ్మానందం, జీవా, వేణుమాధవ్, మాస్టర్ భరత్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, ప్రగతి, సురేఖావాణి, శ్రావణ్, సమీర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రానికి సమర్పణ: శ్రీమతి తులసి, మేకప్: మహేష్, కాస్ట్యూమ్స్: రామకృష్ణ, స్టిల్స్: డి. రాజా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సాహిత్యం : వేటూరి, కేదర్‌నాథ్, ఆర్ట్: నారాయణరెడ్డి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, సంగీతం: మహేష్ శంకర్, కో-డైరక్టర్: కె. హరికృష్ణ, అసోసియేట్ డైరక్టర్స్: బి. నాగిరెడ్డి, వి. శ్రీమన్.

ఇకపోతే.. ప్రొడక్షన్ కంట్రోలర్: రవి, ప్రొడక్షన్ మేనేజర్ : భాషా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్, కో-ప్రొడ్యూసర్స్: సి.హెచ్. వెంకటరెడ్డి, జానకిరామ్ (జాని), నిర్మాత: మహేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కళ్యాణ్ మంతెన.
About Writer
SELVI.M