Actor Pavan Kalyan | Komaram Puli | AR Rehman | ఆ పాటలో నటించేటపుడు ఏడ్చేశాను: పవన్ కల్యాణ్
WD
కొమరం పులి చిత్రం ఆడియో కార్యక్రమం సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... తాను రికార్డులు కోసం ఏ సినిమాను ఇంతవరకూ చేయలేదనీ, కొన్ని సినిమాలు అనుకోకుండా సక్సెస్‌లు సాధించాయని చెప్పుకొచ్చారు. అదేవిధంగా తన తాజా చిత్రం కొమరం పులిలో గుండెను పిండేసే ఓ పాట ఉందన్నాడు.
తండ్రి గురించి వర్ణిస్తూ పాడే ఆ పాటలో తాను నటించేటపుడు ఏడ్చేశానని పవన్ కల్యాణ్ అన్నాడు. ఆ సన్నివేశంలో నటించేటపుడు తన తండ్రి వెంకట్రావుగారు గుర్తుకు వచ్చారనీ, దాంతో నిజంగానే ఏడ్చేశానన్నారు. హృద్యమైన సన్నివేశాలను చూసి ప్రేక్షకులే కాదు... ఆ సన్నివేశాలలో నటించే హీరోహీరోయిన్లు కూడా ఏడుస్తారని పవన్ వివరించారు.