Akkineni Nagarjuna | Gaganam | New movie | యువసామ్రాట్ నాగార్జున కొత్త సినిమా "గగనం"
WD
శుక్రవారం హైదరాబాదులో టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడారు. తాను ఇటీవల నటించిన "కేడీ" చిత్రంతో తన బుర్ర పాడైందనీ, తన బుర్రే కాదు, ప్రేక్షకుల బుర్రలు కూడా పాడై ఉంటాయని ఛలోక్తి విసిరారు. ఆ గ్యాప్‌లో రాధామోహన్‌గారు తనకు ఓ కథ వినిపించారనీ, ఆ కథ విన్నాక సినిమా చేద్దామని ఆయనతో చెప్పానన్నారు.
అలా మొదలైన చిత్రం భారీ సెట్టింగులతో, యాక్షన్, సెంటిమెంట్ సీన్లతో ముగిసిందన్నారు. ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా ఉంటుందనీ, భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనీ ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా కాలం తర్వాత వేదికపై సుదీర్ఘంగా మాట్లాడాననీ, ఈ సినిమా చేసినప్పుడు పొందిన అనుభూతి అలా మాట్లాడిస్తోందని నాగ్ చెప్పారు.