వంశీ దర్శకత్వంలో కీర్తి కంబైన్స్ పతాకంపై కుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం "సరదాగా కాసేపు". కానీ ఈ చిత్రం ఆడియో శనివారం రాత్రి 7 గంటల నుంచి 10.30 గంటల వరకూ కొనసాగడం పట్ల అతిథులు విసుగు చెందారు. చిత్రం ఆడియో కార్యక్రమం వంశీ అండ్ కో వారికి సరదాగా ఉందేమోగానీ తమకు "కష్టంగా చాలాసేపు" కూర్చోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గాయనీగాయకులతో చిత్రంలోని ఐదు పాటలను ఆలపింపజేశారు. మళ్లీ వారికి పోటీ నిర్వహించారు. దీంతో లబ్ది పొందింది గాయనీగాయకులు మాత్రమే. వంశీ ఇటువంటి పచ్చి పనులు చేయడంలో చాలా గ్రేట్ అని అక్కడివారు అనుకోవడం విశేషం.