Ra.One | Shahrukh Khan | Salesman | Promotion | రా.వన్ కోసం సేల్స్‌మాన్ అవతారమెత్తిన పిలక షారుక్
అవును. ఇపుడు సినిమాలను అమ్ముకోవడం చాలా కష్టంగా మారింది. ఒకప్పుడు సినిమాల్లో నటించేసి పారితోషికాన్ని జేబుల్లో వేసుకుని కారెక్కి వెళ్లిపోయేవారు నటీనటులు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమాలో నటిస్తే చాలదు. తగిన విధంగా ప్రమోషన్ చేసుకోవాలి. లేదంటే జనాలు థియేటర్ల ముఖం చూడరు.
ఇది బాగా తెలిసిన షారుక్ విభిన్న తరహాలో దీపావళికి విడుదల కానున్న రా.వన్ కోసం నానా తంటాలు పడుతున్నాడు. ఇంటర్నెట్, టీవీ, స్టేజ్.. ఇలా ఓ ఒక్కదాన్ని విడిచి పెట్టడం లేదు. ఇంటర్నెట్‌లో యూ ట్యూబ్ ఓపెన్ చేస్తే జిమ్మిక్కులు చేస్తూ రా.వన్ చిత్రం తాలూకు ట్రెయిలర్స్‌ను పరిచయం చేస్తున్నాడు.
నెట్‌లో ఇచ్చే జోష్ సరిపోవడం లేదనుకున్నాడో ఏమోగానీ మెల్లిగా స్టేజ్ షోలు కూడా ఇచ్చేస్తున్నాడు. పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకర్షించి రా.వన్ చిత్రంలో తాను చేసిన ఫీట్స్‌ను పరిచయం చేస్తున్నాడు. మొత్తమ్మీద రా.వన్ సినిమాను భారీ మొత్తానికి అమ్మేందుకు పిలక షారుక్ చాలా కష్టాలే పడుతున్నాడు.