రవితేజ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో డేరింగ్ ప్రొడ్యూసర్ వైవియస్ చౌదరి బొమ్మరిల్లువారి పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం 'నిప్పు' సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఆడియోను డిసెంబర్ 13న విడుదల చెయ్యడానికి ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వైవియస్ చౌదరి మాట్లాడూతూ - ''చూడాలని వుంది, ఒక్కడు సినిమాల ద్వారా మణిశర్మ కాంబినేషన్‌లో మ్యూజిక్ పరంగా ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసి మ్యూజిక్ పట్ల తనదొక డిఫరెంట్ టేస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు మా దర్శకులు గుణశేఖర్. అలాగే సీతారాముల కళ్యాణం చూతము రారండి నుండి సలీమ్ వరకు కీరవాణిగారు, రమణగోగుల, మణిశర్మ, చక్రి, సందీప్‌చౌతా వంటి విభిన్న సంగీత దర్శకుల నుండి మంచి సంగీతాన్ని రాబట్టుకొని మ్యూజిక్ పరంగా నా టేస్ట్‌ని ప్రూవ్ చేసుకున్నాను.