గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » తాగినప్పుడు కొట్టుకుంటాం.. ఆ తర్వాత ఏడుస్తాం: షారుక్‌తో శిరీష్ ప్యాచప్ (Shah Rukh Khan | Shirish Kunder | Farah Khan)
Shirish
IFM
షారుక్ ఖాన్ - శిరీష్ కుందర్ మధ్య మాటల యుద్ధం ముగిసింది. షారుక్ చేతిలో తన్నులు తిన్నప్పటికీ శిరీష్ తన భార్య ఫరాఖాన్‌ను వెంటబెట్టుకుని మంగళవారం సాయంత్రం తిన్నగా షారుక్ ఖాన్ ఇంటికి వెళ్లాడు. సుమారు నాలుగు గంటలపాటు షారుక్ కుటుంబంతో గడిపారు. అనంతరం శిరీష్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాడు.

పార్టీల్లో మందుకొట్టినప్పుడు తన్నుకోవడం... గుద్దుకోవడం మామూలే. పార్టీ అన్నాక అవన్నీ సహజం. ఆ వేళ మేమిద్దరం పూటుగా తాగం. ఆ మైకంలో ఏదోదే చేశాం. కానీ ఏం జరిగిందన్నది మాకు తెలుసు. మీడియాలో మాత్రం ఏవేవో కథనాలు వచ్చాయి.

అందుకే ఈ రోజే షారుక్ ఇంటికి వచ్చాం. మా ఇద్దరి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. మా సంబంధం బలంగా ఉన్నది. షారుక్ ఇంట్లో మూడు గంటలు కూర్చుని మాట్లాడుకున్నాం. నవ్వుకున్నాం.. ఆ తర్వాత ఏడ్చుకున్నాం.

ఏదేమైనా ఈ గందరగోళానికి, మా మధ్య రగిలిన సమస్యను తీర్చడంలో సాజిద్ ఖాన్ చొరవకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చెప్పాడు శిరీష్. కానీ షారుక్ ఖాన్ మాత్రం బయటకు రాలేదు మరి.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia