రవితేజ హీరోగా శ్రీవెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శివ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న భారీ చిత్రం 'దరువు'(సౌండ్ ఆఫ్ మాస్) క్లైమాక్స్ షూటింగ్ పూర్తి కావస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాత బూరుగపల్లి శివరామకృష్ణ మాట్లాడుతూ - ''ఈ చిత్రం క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం ఓ భారీ సెట్‌లో పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల 25 వరకు హైదరాబాద్, బెంగుళూరులలో జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్ పూర్తవుతుంది. ఏప్రిల్‌లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి మే 4న చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం.
రవితేజ కెరీర్‌లో ఇదొక ఢిపరెంట్ కమర్షియల్ ఫిలింగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. రవితేజకు మాస్‌లో వున్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని అతని బాడీ లాంగ్వేజ్‌కి తగినట్టుగా అతని కోసమే చేసిన సబ్జెక్ట్ ఇది. ఎంటర్‌టైన్‌మెంట్‌ని కోరుకునే ప్రేక్షకులను 100% ఎంటర్‌టైన్ చేసే చిత్రమిది'' అన్నారు.