మాస్ మహారాజా రవితేజ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌పై భారీ చిత్రాల నిర్మాత 'ఛత్రపతి' ప్రసాద్ నిర్మిస్తున్న 'దేవుడు చేసిన మనుషులు' షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ- ''ఇడియట్ చూసినప్పటి నుండి రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సూపర్‌హిట్ సినిమా చెయ్యాలన్న కోరిక నాలో కలిగింది.