ప్రధాన పేజివినోదం » వెండితెర » కథనాలు » 50 రోజుల "గబ్బర్ సింగ్" రికార్డు కలెక్షన్లతో "మగధీర" కెవ్వు కేక (Gabbar Singh Record Collections | 50 Days | rs 76 Crores)
50 రోజుల "గబ్బర్ సింగ్" రికార్డు కలెక్షన్లతో "మగధీర" కెవ్వు కేక
సోమవారం, 25 జూన్ 2012( 14:58 IST )
మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ 50 రోజులు పూర్తి చేసుకుని రికార్డు కలెక్షన్లతో దూసుకపోతోంది. 307 సెంటర్లలో విడుదలైన గబ్బర్ సింగ్ సినిమాకు మరి ఏ సినిమా కూడా పోటీ ఇవ్వలేకపోతోంది.
ఇప్పటివరకూ ఉన్న మగధీర రికార్డును చెరిపివేసే దిశగా పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ వెళుతోంది. మగధీర 50 రోజుల్లో రూ. 50 కోట్లు వసూలు చేస్తే, గబ్బర్ సింగ్ 50 రోజుల్లో సుమారు 76 కోట్ల రూపాయలు వసూలు చేసి తెలుగు సినీ ఇండస్ట్రీ బాక్సాఫీసు రికార్డులను షేక్ చేస్తోంది.
WD
గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కల్యాణ్ నటన సింపుల్ అండ్ సుపర్బ్ గా ఉండటంతో ప్రేక్షకులు వారాంతాల్లో ఎగబడుతున్నారు ఈ సినిమాను చూసేందుకు. మొత్తమ్మీద ఫ్లాపులతో కూనారిల్లుతోన్న టాలీవుడ్ ఇండస్ట్రీకి గబ్బర్ సింగ్ హిట్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.