Nitin | Courier boy Kalyan Film | Nitya Menon | నితిన్ "కొరియర్‌బాయ్ కళ్యాణ్" చిత్రం ప్రారంభం
WD
నితిన్ మాట్లాడుతూ, నా కెరీర్‌లో పెద్ద హిట్ ఇచ్చిన ఇష్క్ సినిమా ఇచ్చిన బేనర్‌తో నటించడం ఆనందంగా ఉంది. ఇది పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుంది. కుటుంబ సంబంధాల చుట్టూ తిరిగే కథ. సాంకేతికంగా కూడా ఉత్తమ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకముందని చెప్పారు.
నిర్మాత నిఖితారెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 22 నుంచి అక్టోబర్ 1 వరకూ తొలి షెడ్యూల్‌ను జరుపుతాం. అనంతరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లలో నెలకో 15 రోజులపాటు చిత్రీకరణ చేయనున్నాం. యువతకు నచ్చే కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలతో అన్ని వర్గాలవారినీ ఆకట్టుకుంటుంది అన్నారు.
ఇంకా మధునందన్, అలీ, సంధ్య జనక్, ఎం.ఎస్. నారాయణ, రఘుబాబు, ఆహుతిప్రసాద్, ప్రగతి, దువ్వాసి మోహన్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి మాటలు, కథనం: హర్షవర్ధన్, సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: ఆండ్రూబాబు, కథ, దర్శకత్వం: విజయ్‌కుమార్ కొండా.