మహేష్ బాబు 'ఆగడు' చిత్రం తను చేయబోయే 4 చిత్రాల లిస్టులో లేదని బాలీవుడ్ సెక్సీక్వీన్ సోనమ్ కపూర్ చెప్పుకొచ్చింది. ఆ నాలుగు చిత్రాలు గురించి చెపుతూ... రంఝానా, భాగ్ మిల్కా భాగ్, యష్ రాజ్ ఫిలిమ్స్ చిత్రం, ఖూబ్ సూరత్ రీమేక్ చిత్రాలు చేస్తున్నట్లు వెల్లడించింది.కాగా మహేష్ బాబు చిత్రం 'ఆగడు'లో మహేష్ సరసన అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ నటిస్తుందంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై బాలీవుడ్ సెక్సీ బ్యూటీ సోనమ్ మాట్లాడుతూ... అసలు ఆగడు సినిమా గురించే తనకు తెలియదని, ఆ సినిమాలో నటిస్తానని సంతకం కూడా చేయలేదని అంది.అలాంటప్పుడు ఆ చిత్రంలో నటించే అవకాశం ఇంకెక్కడిది అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కుండబద్ధలు కొడుతున్నట్లు చెప్పింది సోనమ్ కపూర్. మరి సోనమ్ నటిస్తుందంటూ పుకార్లు పుట్టించిందెవరో...? చూడాలి దర్శకనిర్మాతలు ఏమయినా చెపుతారేమో..?