నా పేరు వరుణ్ సందేశ్. వరుణ్ అంటే వర్షం. నేను పుట్టినప్పుడు వరదలు, ఉరుములు మెరుపులతో గందరగోళంగా ఉంది. అందుకే తల్లిదండ్రులు వరుణ్ సందేశ్ అని పెట్టారంటూ.. తన పుట్టినప్పటి పరిస్థితిని వివరించాడు వరుణ్ సందేశ్. ఇదంతా 'వర్షం సాక్షిగా' అనే సినిమా కోసం. రాహుల్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రమణ మొగిలి దర్శకుడిగా 'ఈ వర్షం సాక్షిగా' చిత్రం బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. వరుణ్ సందేశ్, హరిప్రియ మరోసారి జతకట్టారు. బి.ఓబుల్ సుబ్బారెడ్డి, శ్రీనివాస్ చవాకుల నిర్మాతలు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి ప్రసన్నకుమార్ క్లాప్‌నిచ్చారు. తణుకు ఎమ్.ఎల్.ఏ కార్మూరి నాగేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. విద్యాసాగర్ గౌరవ దర్శకత్వం వహించగా చిత్రీకరించారు.