'ఎవడు' కోసం బ్యాంకాక్‌కు రామ్‌ చరణ్, శ్రుతి హాసన్

Ram charan
Venkateswara Rao. I| Last Modified గురువారం, 6 జూన్ 2013 (19:34 IST)
WD
రామ్‌ చరణ్‌ బ్యాంకాక్‌కు పయనమై వెళ్లాడు. వేసవి సెలవులు అయిపోవడంతో సినిమా షూటింగ్‌ నిమిత్తం బయలుదేరాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎవడు' చిత్రం కోసం ఆయన బ్యాంకాక్‌ వెళ్ళినట్లు తెలిసింది.

అక్కడ కొన్ని కీలక దృశ్యాలు యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించనున్నారు. ఇటీవలే శ్రుతిహాసన్‌, రామ్‌ చరణ్‌పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఎమీజాక్సన్‌ కూడా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని జులైలో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :