రామ్ చరణ్ 'ఎవడు'లో కాజల్ చనిపోతుందట...!

Venkateswara Rao. I| Last Modified సోమవారం, 5 ఆగస్టు 2013 (08:56 IST)
FILE
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, శృతిహాసన్, అమీజాక్సన్ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం 'ఎవడు'. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్‌లు ప్రత్యేక పాత్రలను పోషించారు. ఇప్పుడు ఈ సినిమాలో తన పాత్రేమిటో కాజల్ బయటపెట్టేసింది.

ఈ సినిమాలో తనది చిన్న పాత్రే అయినప్పటికీ ప్రాధాన్యత ఉంటుందనీ, అయితే ఇందులో తన పాత్ర చనిపోతుందనీ, అక్కడి నుంచి కథ పెద్ద మలుపు తీసుకుంటుందనీ కాజల్ చెబుతోంది. పాత్ర నచ్చడం వల్లే చిన్నదైనా చేశానని చెప్పింది. కాగా, ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చరణ్ సరసన శృతిహాసన్, అమీ జాక్సన్ కథానాయికలుగా నటించారు.దీనిపై మరింత చదవండి :