గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రం టైటిల్ 'హడల్'...!
FILE
యంగ్ హీరో ఎన్టీఆర్ అందర్నీ 'హడల్' ఎత్తించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా', 'రభస' సినిమాలను చేస్తున్నాడు. వీటి తర్వాత మిర్చి డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'హడల్' అనే సినిమా చేయనున్నాడు. 'మిర్చి' ఫేం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయడానికి అంగీకరించిన విషయం మనకు తెలిసిందే. చిత్రానికి ఈ 'హడల్' టైటిల్ని పరిశీలిస్తున్నారు.

ఈ చిత్రం కోసం ఇప్పటికే దర్శకుడు శివ 'హడల్' టైటిల్ని రిజిస్టర్ చేసి వుంచాడట. కథకు ఇది సరిగ్గా సరిపోతుందనీ, దీనినే ఖరారు చేస్తారనీ అంటున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగు ప్రారంభం కావచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా', 'రభస' సినిమాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మిర్చితో ప్రభాస్‌కి భారీ హిట్ ఇవ్వటంతో జూనియర్ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి.
సంబంధిత సమాచారం
Feedback Print