తెలుగు సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వర రావు 90వ పుట్టినరోజు వేడుకలు ఈనెల 20వ తేదీన ఘనంగా జరుగనున్నాయి. ఈ వేడుకలను టి సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్తు నిర్వహించనుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు.