మహేష్ బాబు, తమన్నా కాంబినేషన్‌లో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం 'ఆగడు'. శ్రీను వైట్ల దర్శకుడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం ఇటీవలే బళ్ళారి వెళ్ళింది. అక్కడకు 30 కిలోమీటర్ల దూరంలో తులూరులో ప్రకృతి అందాల మధ్య హీరోహీరోయిన్లపై నృత్యాలు తీస్తున్నారు. 50 మంది డాన్సర్లు పాల్గొన్న ఈ పాటలకు ప్రేమ్ రక్షిత్ నృత్యదర్శకత్వం వహిస్తున్నారు.