బూతు చిత్రాల దర్శకుడిగా పేరుపొందిన మారుతి.. ఇప్పుడు అతను ఏ చిత్రం చేసినా..అదే బాపతు అనుకుంటున్నారు. ఇటీవలే హీరో నితిన్ కూడా ఆయనై సెటైర్ వేశాడు. యూతు పేరుతో బూతు చిత్రాలు తీస్తున్నాడు. దాన్నుంచి బయటపడాలని సభలోనే ఆయన ఉన్నప్పుడే అన్నాడు. మారుతికి పెద్ద షాక్ ఇచ్చాడని ఇండస్ట్రీ భావించింది. అందుకేనేమో ఇప్పుడు మారుతి మాటలు మారిపోయాయి. తాజాగా ఆయన అల్లు శిరీష్‌తో 'కొత్తజంట' చేశాడు. అందులో చిరంజీవి చిత్రంలోని రీమిక్స్ సాంగ్ చేశాడు.