''వీరుడొక్కడే'' మూవీ రివ్యూ రిపోర్ట్!

Ganesh|
WD
తెలుగులో 'ట్రాఫిక్‌' చిత్రాన్ని అందించిన భీమవరం టాకీస్‌ అధినేత తుమ్మలపల్లి రామసత్య నారాయణ అందిస్తున్న మరో ప్రతిష్టాత్మక అనువాద చిత్రం 'వీరుడొక్కడే'. అజిత్‌, తమన్నా జంటగా 'శౌర్యం' ఫేమ్‌ శివ దర్శకత్వంలో 'వీరమ్‌' పేరుతో తమిళంలో రూపొంది.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అజిత్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని 'వీరుడొక్కడే' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నలుగురు అన్నదమ్ముల మధ్య సాగే కథ. ఒక గ్రామంలో అజిత్‌తో పాటు అతని నలుగురు తమ్ముళ్లు పోకిరిగా తిరుగుతూ గొడవల్ని కొనితెచ్చిపెడుతుంటారు. ఇంకా పెళ్లంటూ చేసుకోకూడదని, భార్య అంటూ వస్తే సోదరులు విడిపోతామని, కాబట్టి వివాహం చేసుకోకూడదని శపథం చేస్తారు. కానీ ఈ ఐదుగురిలో ఇద్దరు ప్రేమలో పడతారు.

అయితే తమకంటే పెద్దవాళ్లు పెళ్లి చేసుకోకూడదనే శపథంతో ఉన్నప్పుడు తమ ప్రేమ పెళ్లి జరగదనే ఉద్దేశంతో అన్నయ్యలను సైతం ప్రేమలో పడేట్లు ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో తమన్నా, అజిత్‌ల మధ్య ప్రేమాయణం మొదలవుతుంది.

పంచపాండవులకు గొడవలంటే మహాయిష్టం. ఈ విషయం తెలియని తమన్నా.. అజిత్ ప్రేమలో పడిపోతుంది. ఈ క్రమంలో అజిత్ నైజం మెల్లగా బయటపడుతుంది. దీంతో తాను ఇష్టపడిన యువతి తనకు దూరమవుతుందని భావించిన అజిత్.. ఆమెతో పాటు.. ఆమె తండ్రిని కూడా ఒప్పిస్తాడు. ఈ క్రమంలో అజిత్ సోదరులు అదే ఊరిలో కొద్దిరోజులుంటారు.

ఈ నేపథ్యంలో ఓ ముఠా ఈ ఐదుగురుని చంపేందుకు కుట్ర పన్నుతుంది. అయితే ఆ ముఠా ఈ ఐదుగురిని టార్గెట్ చేయలేదని, వారి లక్ష్యం తమన్నా ఫ్యామిలీనేనని తెలిసిపోతుంది. ఆ ముఠా ఎవరు? ఆ ముఠా తమన్నా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేసింది? నాజర్ కుటుంబానికి తెలియకుండానే అజిత్ సోదరులు ఆ ముఠాను ఎలా మట్టుబెడతారు అనేది కథాంశంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

విశ్లేషణ :
పూర్తి మాస్ కథకు కామెడీ, సెంటిమెంట్, లవ్, యాక్షన్ అన్నింటిని కలిపి ఫ్యామిలీ డ్రామాగా దర్శకుడు తెరకెక్కించాడు. గత సినిమాల కంటే అజిత్ మేకప్ లేకుండా పంచెలో అభిమానులను ఆకట్టుకున్నాడు. నటనా పరంగా సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. ఇంకా తమన్నాతో లవ్, సెంటిమెంట్, కామెడీ బాగా పండించాడు. మొత్తానికి తెలుగు ప్రేక్షకులకు అజిత్ సమ్మర్‌లో కొంచెం వినోదాన్ని పంచనున్నాడు.


దీనిపై మరింత చదవండి :