సమంత సినిమాలో తమన్నా ఐటెం సాంగ్!

Ganesh| Last Modified సోమవారం, 31 మార్చి 2014 (12:47 IST)
FILE
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ చేస్తుంటారు. అక్కడ ఐటెం సాంగ్స్‌కు మంచి క్రేజ్ వుండటంతో హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్‌లో డ్యాన్స్ చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే ఈ ట్రెండ్‌ను టాలీవుడ్ కూడా వంటబట్టించుకుంటోంది. తాజాగా ఓ ఐటెం సాంగ్ చేయడానికి మిల్కీ బ్యూటీ తమన్నా అంగీకరించినట్లు సమాచారం.

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని ఓ ఐటెం సాంగ్‌లో డ్యాన్స్ చేయడానికి తమన్నాను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు తెలిసింది. ఏప్రిల్ నెలాఖరులో ఈ పాటను తెరకెక్కిస్తారని సమాచారం. ఇందులో క్రేజీ స్టార్ సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.

దేవీశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నాడు. తమన్నా చేయబోతున్న తొలి ఐటెం సాంగ్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం తమన్నా తెలుగులో బాహుబలి, ఆగడు చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.


దీనిపై మరింత చదవండి :