చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తినే పెళ్లాడతా: బాపుబొమ్మ
Publish: Mon, 6 Aug 2007 (12:34 IST)
Updated: Mon, 6 Aug 2007 (12:34 IST)
తెలుగు వెండి తెరపై త్వరలో 'బాపు బొమ్మ'గా కనువిందు చేయనున్న అందాలనటి తన మనసులోని మాటను వెల్లడించింది. చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తే తన భాగస్వామిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నట్టు ఛార్మీ పేర్కొంది. బాపు సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ లభించడం అరుదైన అవకాశంలాంటిదని ఈ అందాలనటి పేర్కొంది. ఈ చిత్రంలో క్యారెక్టర్ పరంగా లావుగా మారాల్సి వచ్చిందని, దీనివల్ల తన అవకాశాలు ఏమాత్రం తగ్గవని ఛార్మీ పేర్కొంది. ఇదిలావుండగా.. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఫిలింఫేర్ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో యువ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌తో కలసి చిందులు వేసి ఆ కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతంలో వీరమధ్య ప్రేమాయణం జరిగినట్టు చిత్రపరిశ్రమ వర్గాల భోగట్టా. ఈ నేపథ్యంలో ఛార్మీ తాజా వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తున్నాయి.